ఆగస్టు 30న ఐపీఎల్ పూర్తి షెడ్యూల్!

  • ఈసారి యూఏఈ గడ్డపై ఐపీఎల్
  • ప్రారంభ, ముగింపు తేదీల ప్రకటన
  • షెడ్యూల్ పై స్పష్టతనిచ్చిన ఐపీఎల్ చైర్మన్
మరికొన్ని వారాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ యూఈఏ వేదికగా ప్రారంభం కానుంది. సెప్టెంబరు 19న ప్రారంభమై, నవంబరు 10న ముగుస్తుంది. ఐపీఎల్ ప్రారంభ, ముగింపు తేదీలు తప్ప ఇప్పటికీ పూర్తి షెడ్యూల్ వెల్లడి కాలేదు. దీనిపై ఐపీఎల్ చైర్మన్ బ్రజేశ్ పటేల్ వివరణ ఇచ్చారు. ఆగస్టు 30 నాటికి ఐపీఎల్ షెడ్యూల్ వచ్చే అవకాశముందని వెల్లడించారు. ఈసారి పోటీలు భారత వెలుపల యూఏఈలో జరగనున్నందున ఫ్రాంచైజీలు ఇంకా కుదురుకోలేదని, వేదికల పరిశీలన కూడా పూర్తి కాలేదని, అందుకే షెడ్యూల్ ఆలస్యమవుతోందని పటేల్ వివరించారు.

ప్రస్తుతం ఐపీఎల్ పాలకమండలి సభ్యులు యూఏఈలో ఉన్నారని, టోర్నీ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న ఐఎంజీ సంస్థ ప్రతినిధులతో కలిసి అన్ని అంశాలను ఖరారు చేసే పనిలో ఉన్నారని తెలిపారు. చివరిగా బీసీసీఐ వర్గాలు యూఏఈ అధికారులతో కలవాల్సి ఉందని, ఆ పిమ్మట షెడ్యూల్ కు ఓ రూపు వస్తుందని భావిస్తున్నామని చెప్పారు.

IPL 2020
Schedule
August 30
UAE
BCCI
India

More Telugu News